క్రిష్ణవేణి పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
మండల కేంద్రంలోని క్రిష్ణవేణి పాఠశాలలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ విద్యార్థులు గురువులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితానికి మంచి మార్గనిర్దేశం చేస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు.ప్రిన్సిపాల్ బి. సురేష్,అకాడమిక్ డైరెక్టర్ జె. మణి మాట్లాడుతూ విద్యార్థులు తమ గురువుల సూచనలు, సలహాలను పాటిస్తూ విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని గురుపూజోత్సవాన్ని విజయవంతం చేశారు.