నీట్‌లో లోకేశ్వరం విద్యార్థిని ప్రతిభ…*

*నీట్‌లో లోకేశ్వరం విద్యార్థిని ప్రతిభ…*

*419 మార్కులతో కామారెడ్డి మెడికల్‌ కళాశాలలో సీటు*

లోకేశ్వరం, సెప్టెంబర్ 5అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన పోతరాజు మేఘన,నీట్‌ ప్రవేశ పరీక్షలో 419 మార్కులు సాధించారు.దీంతో కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్‌ సీటు పొందారు.

మేఘన పోతరాజు గంగారం–దేవమని దంపతుల కుమార్తె. వైద్యురాలు కావాలనే లక్ష్యంతో చదువులో కృషి చేసి నీట్‌లో మంచి మార్కులు సాధించారు. ఆమెకు మెడికల్‌ సీటు రావడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

మేఘనను కాలనీవాసులు గ్రామస్థులు, ఉపాధ్యాయులు,అభినందించారు.ఆమె విజయం మండలంలోని విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking