రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ధర్మ సమాజ్ పార్టీ రామన్నపేట మండల అధ్యక్షుడు బందెల అశోక్

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) రామన్నపేట మండల అధ్యక్షుడు బందెల అశోక్ డిమాండ్ చేశారు. శనివారం రామన్నపేట మండల బీసీ, ఎస్సి, ఎస్టి జెఏసి మరియు డిఎస్పి కమిటీల ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ ఎంఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బందెల అశోక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు కళాశాలల్లో తమ చదువులను కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సి, ఎస్టి జెఏసి మరియు డి ఎస్ పి మండల ఉపాధ్యక్షుడు మల్లేష్, కార్యదర్శి స్వామి, నరేందర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking