బుల్లెట్ రైలు దీక్షకు క్రైస్తవ సంఘాల మద్దతు
ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ సంఘాల నాయకులు,ఉత్తమ సామాజిక సేవా అవార్డు గ్రహీత బిషప్ దుర్గం ప్రభాకర్
సూర్యాపేట , అక్షిత బ్యూరో :
ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న సూర్యాపేట జిల్లా ద్వారా రైలు మార్గం వెళ్ళే విధంగా తొలుత ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ కారిడార్ అలైన్మెంట్ రూట్ మ్యాప్ ఎట్టి పరిస్థితుల్లో మార్చ వద్దని ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ సంఘాల నాయకులు, ఉత్తమ సామాజిక సేవా అవార్డు గ్రహీత బిషప్ దుర్గం ప్రభాకర్ హెచ్చరించారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక డా.బిఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద గత 22 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ సంఘాల నాయకుల పక్షాన బిషప్ దుర్గం ప్రభాకర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వే శాఖ మొట్ట మొదటిగా 1853 లో ప్రవేశ పెట్టారనీ,1947 లో దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలుగా పని చేస్తున్నట్లు చెప్పారు.1951 లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే శాఖ,ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించిందనీ గుర్తు చేస్తూ భారత రైల్వే ముఖ్యంగా వాణిజ్య అవసరాలతో పాటు ప్రజల దూర ప్రయాణాలకు, నగరాలతో పాటు పట్టణాలకు ఆనుకుని ఉన్న పొలిమేర ప్రాంతాలకు అవసరమైన రైళ్ళను నడుపుతోందని పేర్కొన్నారు.వాణిజ్య,ప్రజల అవసరాల దృష్ట్యా సూర్యాపేట జిల్లా ప్రాంత వాసులు రైలు అవసరo అయినప్పటికీ జిల్లా ప్రజలు రైలు ప్రయాణం నోచుకోలేక పోవడం బాధాకరమన్నారు.సూర్యాపేట జిల్లాకు చుట్టూ వున్నా జిల్లాలు హైదరాబాద్,నల్గొండ,ఖమ్మం, మహబూబాబాద్,యాదాద్రి భువనగిరి,జనగాం,వరంగల్ కేంద్రాల ద్వారా సూర్యాపేట జనం ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకోసo సూర్యాపేట జిల్లా ప్రజల ఆకాంక్ష,వాణిజ్య అవసరాల కోసం.రైలు మార్గాన్ని తొలుత ప్రకటించిన విధంగానే అలైన్మెంట్ కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిహెచ్.శ్యామ్ ప్రసాద్,ముల్లంగి జాకబ్ రాజు, జలగం జేమ్స్,చింత మనిషే,పి. మార్క్,కొండేటి లాజర్,యం. రూబెన్,పంది మార్క్,కొమ్ము హోసన్నా,మామిడి క్రిస్టోఫర్, పిట్టల సామెలు,రెంటాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.