శిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి….
జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి. సుజాత
జగిత్యాల అక్షితబ్యూరో:
జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి. సుజాత అధ్యక్షతన 03.09.2026న శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన శిశు మరణాల కారణాలను విశ్లేషించి, నివారణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.సమావేశంలో జిల్లాలో నమోదైన శిశు మరణాలకు దారితీసిన కారణాలు, హైరిస్క్ గర్భిణీల పర్యవేక్షణ, ప్రసవాల నిర్వహణ, నవజాత శిశువుల సంరక్షణ, అత్యవసర రిఫరల్ సేవలపై సమగ్రంగా సమీక్షించారు.హైరిస్క్ గర్భిణీలను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని, గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలని డాక్టర్ జి. సుజాత సూచించారు. ప్రసవ సమయంలో తల్లి, శిశువుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నవజాత శిశువుల్లో అనారోగ్య లక్షణాలను తొలిదశలోనే గుర్తించి, పరిస్థితి తీవ్రతను బట్టి ఆలస్యం లేకుండా ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యాధికారులు సమన్వయంతో పని చేసి శిశు మరణాల నివారణకు కృషి చేయాలని సూచించారు.ప్రతి శిశు మరణాన్ని చైల్డ్ డెత్ రివ్యూ ద్వారా సమగ్రంగా విశ్లేషించి, మరణానికి దారితీసిన కారణాలను గుర్తించాలని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సరిదిద్దే చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ లు డాక్టర్ ఎన్.శ్రీనివాస్, డాక్టర్ ఎం.జైపాల్ రెడ్డి, డీఐఓ డాక్టర్ నరేంద్ర, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అర్చన, డాక్టర్ ఎన్.రాజేందర్, పీడియాట్రిషన్ డాక్టర్ గుండేటి అర్జున్, డాక్టర్ రమా పీడియాట్రిషన్, గైనకాలజిస్ట్ డాక్టర్ బి. ఉష, ఏ.భాస్కర్ డీడబ్ల్యూ, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సతీష్ కుమార్, ,డాక్టర్ శివకుమారి, డాక్టర్ వాహిని, డాక్టర్ సౌజన్య, హెచ్ఇవో ఎ.రాజేశం, హెచ్ఇ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.