12వ వార్డులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి

12వ వార్డులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి

కోదాడ అక్షిత ప్రతినిధి

కోదాడ మున్సిపాలిటీ 12వ వార్డులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా కమిటీ వారు నిర్వహించారు శ్రీకృష్ణుడికి 108 నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఏర్పాటుచేసిన ఉట్టిని ఎమ్మెల్యే ఉట్టి కొట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీకృష్ణ పరమాత్మ బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని అన్నారు. ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ, మానవతా విలువలను శ్రీకృష్ణుడు తన బోధనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతతకు, సమాజంలో ఐక్యతకు దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండపనేని పద్మ నాగేశ్వరరావు , నాగు బండి రంగా, గార్లపాటి వీరారెడ్డి, ఎలగందుల శ్రీనివాసరావు , యాద రమేష్ , యాదా శ్రీను, జి సత్యనారాయణరావు, మహిళలు నాగు బండి జ్యోతి, ఓరుగంటి రమాదేవి,యాద జ్యోతి, శ్రీ రోజు శోభ, వార్డు ప్రజలు పెద్దలు తదితర భక్తులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking