ఎమ్మెల్సీ ఎల్. రమణ  పుట్టినరోజు సందర్భంగా వాల్మీకి ఆవాసంలో అన్నదానం,పండ్ల పంపిణీ

ఎమ్మెల్సీ ఎల్. రమణ  పుట్టినరోజు సందర్భంగా వాల్మీకి ఆవాసంలో అన్నదానం,పండ్ల పంపిణీ

జగిత్యాల అక్షితప్రతినిధి:

తెలంగాణ శాసనమండలి బిఆర్ఎస్ పార్టీ ఉపనేత, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ 65వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాలలోని శ్రీ వాల్మీకి ఆవాసంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గురువారం సేవార్ధ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ వాల్మీకి ఆవాసంలో ఉండే చిన్నారుల మధ్య ఎమ్మెల్సీ రమణ జన్మదిన వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆవాసంలోని చిన్నారులకు ఒక రోజు భోజన నిర్వహణ ఖర్చులను జగిత్యాల వెలమ సంఘం అధ్యక్షుడు అయిల్నేని సాగర్ రావు విరాళంగా అందజేశారు. అనంతరం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చిన్నారులకు పండ్లను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సేవా కార్యక్రమంలో జగిత్యాల పట్టణ కౌన్సిలర్లు కోరుకంటి రాము, తోట హరీష్, పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వర్ రావులతో పాటు పార్టీ నాయకులు నవ్వుతు రవీందర్, పులి మల్లేశం గౌడ్, చెన్న రాము, వెన్నమనేని కృష్ణారావు, వావిలాల నాగరాజు, ఆడెపు సత్యం, పెండం గంగాధర్, సింహరాజు శ్రీధర్, గాజుల శ్రీనివాస్, పార్టీ శ్రేణులు, ఆవాసం ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించిన బిఆర్ఏస్ నాయకులకు శ్రీ వాల్మీకి ఆవాస ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking