ప్రజ్ఞాన్’ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

‘ప్రజ్ఞాన్’ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

 అలరించిన చిన్నారుల వేషధారణలు

ఉప్పల్ అక్షిత ప్రతినిధి 

ఉప్పల్‌లోని ప్రజ్ఞాన్ ది స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. చిన్నారుల శ్రీకృష్ణ, గోపికల వేషధారణలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో భాగంగా బొమ్మ భార్గవ్ తోటి విద్యార్థులు చక్కటి సమన్వయంతో వేసిన శ్రీ కృష్ణ వేషధారణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈవేషధారణతో సమైక్యత, ఆధ్యాత్మికత ఉట్టిపడటంతో పాఠశాల ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. నృత్య బృందాన్ని సమర్థవంతంగా సమర్ధవంతంగా భక్తిశ్రద్దలతో వేసిన శ్రీకృష్ణ గోపికల వేషధారణలతో ఉన్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. పాఠశాలలో విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఐక్యమత్య లక్షణాలు, క్రమశిక్షణ, ఆధ్యాత్మికను పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శకుంతల, ఉపాధ్యాయ బృందం అరుణ, నళిని, ఎలిజబెత్, సువర్ణ, శ్రావంతి, రోజా, నవనీత, నాగమణి తదితరులు పాల్గొని విద్యార్థుల నైపుణ్యాన్ని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking