శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘనంగా జన్మాష్టమి వేడుకలు

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘనంగా జన్మాష్టమి వేడుకలు

-రాధాకృష్ణుల వేషధారణలో విద్యార్థుల కనువిందు

-ఉట్టి కొట్టిన చిన్నారులు.. ఉత్సాహంగా జన్మాష్టమి వేడుకలు

ఖమ్మం/అక్షిత బ్యూరో :

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఖమ్మం ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు చేపట్టారు.వేడుకల్లో భాగంగా చిన్నారులు శ్రీకృష్ణుడు రాధ గోపికల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలలు అలరించాయి. అనంతరం సంప్రదాయబద్ధంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు కార్యక్రమానికి హాజరై చిన్నారులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ రావూరి నివేదిత మాట్లాడుతూ… శ్రీకృష్ణుని జీవితం విద్యార్థులకు ఆదర్శప్రాయమన్నారు. ధర్మాన్ని కాపాడటం సత్యం కోసం నిలబడటం ప్రేమ స్నేహం కరుణ జ్ఞానం వంటి సద్గుణాలను పిల్లలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠ్యాంశాలతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆనందంతో పాటు ఐకమత్యం సహకార భావం స్నేహభావం పరస్పర గౌరవం వంటి విలువలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య ప్రతినిధి మల్లంపాటి శ్రీధర్ డైరెక్టర్‌ శ్రీవిద్య ఏజీఎం చైతన్య, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను అభినందిస్తూ నిర్వాహకులు వారిని ప్రోత్సహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking