తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీ*

*తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీ*
*అంతర్ జిల్లా దొంగ అరెస్ట్*

*గంగాధర్ అక్షిత న్యూస్*

జల్సాలకు వ్యసనాలకు బానిసై తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను గంగాధర పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతని వద్దనుండి చోరీ చేసిన బంగారు ఆభరణాలతో పాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంగాధర ఎస్పై బి. వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన కొండ శశికాంత్ (24) ప్రస్తుతం కరీంనగర్ లో నివాసముంటున్నాడు. గతంలో చిట్ ఫండ్ ఏజెంట్ గా, తర్వాత హీరో షోరూంలో సేల్స్ మెన్ గా పనిచేశాడు. మద్యపానం, గంజాయి వంటి దురలవాట్లకు బానిసై తన స్నేహితులైన సి.హెచ్. సంతోష్ (గోవిందరావుపేట), గనవెల్లి వంశీ (కరీంనగర్) లతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.
ఆగస్టు 28న ముగ్గురు కలిసి TS 37 L 211 నెంబరుగల స్కూటీ పై గంగాధరకు చేరుకొని తాళంవేసి ఉన్న ఓ ఇంటి డోర్ పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారు కమ్మలు, మెట్టెలు, పట్టీలు తదితర ఆభరణాలను అపహరించారు. ఆ తర్వాత మండల పరిసర గ్రామలైన మధురానగర్, కురిక్యాలలోనూ ఇళ్లల్లోకి చొరబడి చోరీ చేసినట్లు తెలిపారు.
*దొరికాడు ఇలా*:
తేది 07 సోమవారం రోజున చోరీ చేసిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేందుకు తన ద్విచక్ర వాహనంపై తిరుగుచుండగా పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా గతంలో చేసిన చోరీలకు సంబంధించిన నేరాలను అంగీకరించాడు.నిందితుడి నుండి చోరీ చేసిన 5 గ్రాముల 2 బంగారు చెవుల మాటీలు, 4 గ్రాముల 2 బంగారు చెవుల కమ్మలు, 6 తులాల రెండు వెండి పట్టీలు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని, మరో ఇద్దరు నిందితులు సంతోష్, వంశీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పై వంశీకృష్ణ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking