గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలి
– ఎస్సై జి. వంశీకృష్ణ
గంగాధర అక్షిత న్యూస్
గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుటకు గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు ముందస్తుగా పూర్తి సమాచారం అందించాలని గంగాధర పోలీస్ స్టేషన్ ఎస్సై జి. వంశీకృష్ణ మంగళవారం సూచించారు. గణేష్ మండపం ఏర్పాటు చేసే నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల వివరాలు, సంప్రదించు నంబర్లు, ఉత్సవాలకు సంబంధించిన ఇతర వివరాలను పోలీస్ శాఖకు ఆన్‌లైన్ ద్వారా తప్పనిసరిగా తెలియజేయాలని తెలిపారు.గణేష్ మండపం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఆన్‌లైన్ లింక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.లింక్: పోలీస్‌పోర్టల్. టిఎస్‌పోలీస్. గౌ. ఇన్మండపాల నిర్వాహకులు పై లింక్ ద్వారా తమ మండపానికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఉత్సవాలను ఎలాంటి ఆవాంచనీయ ఘటనలకు తావుకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకొనుటకు ప్రజలు మరియు గణేష్ ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్సై వంశీ కృష్ణ కోరారు.