ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ వద్ద రహదారి మరమ్మతులు

ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ వద్ద రహదారి మరమ్మతులు

కాజిపేట్, అక్షిత ప్రతినిధి :

ఫాతిమా బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలను రోడ్డు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చొరవతో మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన గుంతలను సిమెంట్ మిక్సర్ తో మెటీరియల్‌తో పూడ్చి, వాహనాల రాకపోకలకు ఏర్పడిన తీవ్ర అంతరాయాన్ని తొలగించారు.గత 10 రోజులుగా ఈ ప్రాంతంలో మూడు నాన్-ఫేటల్ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, రహదారి భద్రత దృష్ట్యా ఈ మరమ్మతు పనులు చేపట్టడం జరిగింది.అదేవిధంగా అదాలత్ సెంటర్ వద్ద కూడా ప్రధాన రహదారిపై ఏర్పడిన మూడు గుంతలను సిమెంట్ మెటీరియల్‌తో పూడ్చి, అక్కడ ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయాన్ని సైతం తొలగించారు.ఈ రహదారి మరమ్మతు పనుల్లో అధికారులు తమ సిబ్బందితో కలిసి పాల్గొని, వాహనదారులకు సురక్షితమైన రాకపోకలకు వీలు కల్పించారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ట్రాఫిక్ సిఐ,ఎస్ఐలు సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking