మాణిక్ రావు వర్ధంతి ఘనంగా నిర్వాణ

మాణిక్ రావు వర్ధంతి ఘనంగా నిర్వాణ

తాండూరు అక్షిత ప్రతినిధి:

తాండూరు స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ తొలి దశ ఉద్యమ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఏఐసీసీ సభ్యుడు ఎం. మాణిక్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని విద్యా వికాస్ సమితి ట్రస్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ట్రస్టు చైర్మన్ శ్రీమతి శశి ప్రభ మాణిక్ రావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి, విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాణిక్ రావు దహన సంస్కారాలు నిర్వహించిన ప్రదేశంలో హిందూ సంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా శశి ప్రభ మాణిక్ రావు మాట్లాడుతూ.. తాండూరు ప్రజల విద్య, వైద్యం, ఉపాధి కోసం మాణిక్ రావు విద్యా వికాస్ సమితి ట్రస్టును స్థాపించి ఆస్తులను ట్రస్టు పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని, తెలిపారు. ట్రస్టు ఆస్తులను కాపా డేందుకు 14 కేసుల్లో న్యాయపోరాటం చేసి విజయం సాధించారని, పేర్కొన్నారు. మాణిక్ రావు ఆశయాలకు అనుగుణంగా ట్రస్టు తాండూరు ప్రజలకు చెందేలా కృషి చేస్తామని, పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, ఎన్. రామకృష్ణ, ఎన్. రఘు ముదిరాజ్, కె. చంద్రకాంత్, బీఆర్‌ఎస్ నేత శుభప్రద పటేల్, ట్రస్టు లీగల్ అడ్వైజర్ పెద్దేముల్ అరుణ్ రాజ్, కచ్చి సయ్యద్, ముస్తఫా పటేల్, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులు, మాణిక్ రావు అభి మానులకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking