గణేష్ మండళ్ల నిర్వాహకులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
రామకృష్ణాపూర్ పోలీసుల విజ్ఞప్తి
మందమర్రి, అక్షిత ప్రతినిధి
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండళ్లను ఏర్పాటు చేయదలచిన ప్రతి మండలి నిర్వాహకుడు తప్పనిసరిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రామకృష్ణాపూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.మండలి నిర్వాహకులు వెంటనే కింది లింక్‌ను ఓపెన్ చేసి, మండలికి సంబంధించిన పూర్తి, సరైన వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్ : https://share.google/uuJ961D0jyD6NK3af గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పోలీస్ శాఖకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించేందుకు ప్రతి మండలి నిర్వాహకుడు ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని పోలీసులు కోరారు.