రైతులకు విద్యుత్ సరఫరాపై ముందస్తు సమాచారం

రైతులకు విద్యుత్ సరఫరాపై ముందస్తు సమాచారం

రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత

చౌటుప్పల్ అక్షిత ప్రతినిధి 

గ్రామంలోని రైతు సోదరులకు విద్యుత్ సరఫరాపై ముందస్తు సమాచారం. విద్యుత్ శాఖ నిర్వహించే పనుల కారణంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఉండదు. రైతుల వ్యవసాయ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈరోజు రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం 4 గంటల తర్వాత విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభమై నిరంతరంగా కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. రైతులు ఈ విద్యుత్ సరఫరా వేళలను గమనించి, వ్యవసాయ పనులను ముందుగానే సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking