విద్యార్థుల సౌకర్యం కోసం 10 బెంచీల బహూకరణ

విద్యార్థుల సౌకర్యం కోసం 10 బెంచీల బహూకరణ

పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం

బహూకరణ చేసిన నారపాక నరేందర్‌

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

మండలంలోని నిదానపల్లి గ్రామ పాఠశాల విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ నారపాక నరేందర్ 10 బెంచీలను పాఠశాలకు బహూకరించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన అందించిన ఈ సహాయాన్ని గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం అభినందించింది. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో దాతలు ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 10 బెంచీలను అందించిన నారపాక నరేందర్‌కు గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల మేలుకోసం నరేందర్‌ చేసిన సేవాభావం మరెందరికో స్ఫూర్తిదాయకమని గ్రామస్తులు కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking