కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
పూజా కార్యక్రమంలోపాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం
కరీంనగర్ అక్షిత బ్యూరో
కరీంనగర్‌లోని పార్లమెంట్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా తొలుత విఘ్నేశుడికి శాస్త్రోక్తంగా పూజలు చేసి, తొలి పూజలందుకున్న దేవుడికి భక్తిశ్రద్ధలతో నమస్కరించారు.
జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని విఘ్నహర్తుడైన గణనాథుని ప్రార్థించారు.అనంతరం ప్రజలందరికీ బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, బండి సంపత్ కుమార్, కార్పొరేటర్ బండ రమణారెడ్డి , రమేష్ పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పార్లమెంట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.