శుభ ప్రద్ పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తాండూర్ హిందూ ఉత్సవ సమితి

శుభ ప్రద్ పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తాండూర్ హిందూ ఉత్సవ సమితి

. హిందూ ఉత్సవ సమితికి విరాళం.. శుభ ప్రద్ పటేల్

. గణపతి పూజలో పాల్గొన్న శుభ ప్రద్ పటేల్

తాండూరు అక్షిత ప్రతినిధి:

తాండూరు పట్టణంలోని ధనగర్ గల్లీలో కురువ భాను ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రీ గణపతి పూజా కార్యక్రమం, అన్నప్రసాద వితరణ కార్య క్రమానికి బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండూర్ హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి బిర్కెట్ రఘు, కౌన్సిలర్లు కిరణ్, రాజు గౌడ్, నాయకులు కాటకం హరీష్, కల్వ వంశీ, శివ ప్రసాద్‌లు శుభ ప్రద్ పటేల్‌ను మర్యాద పూర్వ కంగా కలిసి శాలువాతో సన్మానించారు. అలాగే, నేడు నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. హిందూ ఉత్సవ సమితి నిర్వహిస్తున్న కార్య క్రమాలకు తనవంతు సహకారంగా శుభ ప్రద్ పటేల్ విరాళం అంద జేశారు. హిందూ సంప్ర దాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్య క్రమాలకు ఎల్లప్పుడూ, తన సహకారం ఉంటుందని, ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking