షహనాజ్ బేగంకు ఉస్మానియా
యూనివర్సిటీ డాక్టరేట్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
హైదరాబాద్ లోని సనత్ నగర్, డీఎన్ఎం కాలనీకి చెందిన షహనాజ్ బేగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. ఓయూ క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో, రాష్ట్ర గవర్నర్ మరియు ఓయూ ఛాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన జరిగిన 85వ స్నాతకోత్సవ సభలో, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం చేతుల మీదుగా ఆమె డాక్టరెట్ పట్టాను అందుకున్నారు. ఫతే నగర్ నివాసి మహ్మద్ హుస్సేన్, ఖాజాబీల కూతురైనా షహనాజ్ బేగం, వారి ప్రోత్సాహంతో బాల్యం నుండే విద్యలో తన ప్రతిభను చూపుతూ వచ్చారు. గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఖాజా విజారత్ అలీతో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత కూడా మరింత పట్టుదలతో, తన భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యలో షహనాజ్ బేగం తన సత్తాను చాటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సెక్యూరిటీ యూసింగ్ హొమోమార్ఫిక్ ఎన్క్రిప్షన్ లో డాక్టరెట్ సాధించారు. షహనాజ్ బేగం డాక్టరెట్ పట్టాను పొందడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.