మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని పురుగుల మందు తాగి వ్యక్తి మృతి…

మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని పురుగుల మందు తాగి వ్యక్తి మృతి…

లోకేశ్వరం, సెప్టెంబర్ 17  అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాయపూర్‌ కాండ్లి గ్రామంలో జరిగింది. ఎస్సై ప్రదీప్‌,తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తొండకూరి శ్రీనివాస్‌ (32) కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 13న మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్య లావణ్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌ ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ 16న సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking