ఓటరు నమోదుకు కొత్త దరఖాస్తులు

ఓటరు నమోదుకు కొత్త దరఖాస్తులు

రాజకీయ పార్టీలు సహకరించి అవగాహన కలిగించాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ఓటర్ నమోదు, జాబితాలో మార్పుల కొరకు భారత ఎన్నికల సంఘం నూతన ఫారములను ప్రవేశపెట్టిందని, ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిబంధనల్లో స్వల్ప మార్పులు, గరుడ యాప్, ఆన్లైన్ వెబ్ సైట్ల వినియోగం,ఓటర్ జాబితాలో నమోదు, మార్పుల పై నూతన ఫారాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం చేపట్టిన మార్చులు ఆగస్టు 1, 2022 నుండి అమలులోకి వస్తాయని, ఫారం-6 నూతన ఓటర్ల నమోదు కోసం మాత్రమే వినియోగించడం జరుగుతుందని, ఫారం-7 ద్వారా ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందని, ఫారం 8 ద్వారా ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో నివాసం మార్చు, నమోదు చేసిన వివరాల సవరణ, కొత్త ఓటరు ఫోటో గుర్తింపు కార్జు జారీ కొరకు వైకల్యం ఉన్న వ్యక్తిగా /ఓటరుగా గుర్తించడానికి అభ్యర్థన వంటి అంశాల కొరకు ఉ
పయోగించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్‌ నంబర్‌ కోసం నూతనంగా ఫారమ్‌- 6బిను ప్రవేశపెట్టడం జరిగిందని, ఎన్నికల సంఘం ఆదేశాల క్రమము, ఓటరు జాబితాలో ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు, తమ పేరు నమోదును ధృవీకరించుకొనుటకు ఆధార్‌ నంబర్‌ను ఫారం-6బి ద్వారా తెలియచేయవలసి ఉంటుందని, ప్రతి పౌరునికి ఒకే ఒక్క
ఓటు హక్కు మాత్రమే ఉంటుందని, ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని, ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్చంధంగా ఉంటుందని, ఓటర్లు ఆధార్‌ నంబర్‌ను అందించలేకపోతే ఫారం-6బి లో పేర్కొన్న ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్చించవచ్చని, ఫారం-6బి
ధరఖాస్తు వెబ్‌సైట్‌లు, యాప్‌లలో నిబంధనలను అనుసరించి స్వీయ ప్రామాణీకరణతో యు.ఐ.డి.ఐ. ఎ.తో రిజిస్టర్‌ చేయబడిన మొబైల్‌
నంబర్‌ ఓ.టి.పి.ని ఉపయోగించి ఆధార్‌ను ప్రామాణీకరించుకోవచ్చని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్ల నుండి ఆధార్‌ నంబర్‌ సేకరించడానికి ఇంటింటిని సందర్శించటంతో పాటు ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకోవడం జరిగేదని, ఈ సంవత్సరం నుంచి జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకుంటూ 18 సం॥లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమము-2023ను చేపట్టేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, తేది 01.01.2023 నాటికి 18 సంవత్సరముల వయస్సు నిండిన పౌరులను ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతుందని, ఓటరు జాబితాపై ఆగస్టు 4 నుంచి అక్టోబర్‌ 24వ తేదీ వరకు ప్రీ రివిజన్‌ నిర్వహించి నవంబర్‌ 9వ తేదీన ముసాయదా ఓటరు జాబితా విడుదల, డిసెంబర్‌ 8వ తేదీ వరకు సదరు జాబితాపై అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్‌ 26వ తేదీ లోగా అభ్యంతరాలను, ఓటర్‌ క్షయిమ్స్‌ పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5, 2023న ఓటర్ల జాబితా తుది ప్రచురణ తయారు చేయబడుతుందని తెలిపారు. రాజకీయ నాయకుల ప్రతినిధులు ఓటరు జాబితా తయారీలో అధికారులకు సహకరించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా జాబితా తయారు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జగదీశ్ రెడ్డి,ఎన్నికల డి.టి.విజయ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బి.పిచ్చయ్య(టి.ఆర్.ఎస్),డి.శ్రీ రాములు(వై.ఎస్.ఆర్.సి.పి),మహ్మద్ రజీ యుద్దీన్ ( ఏ.ఐ. యం.ఐ. యం),ఎల్.శ్రావణ్ యాదవ్,(సి.పి.ఐ),జె.సైదిరెడ్డి(కాంగ్రెస్),ఎల్.వి.యాదవ్,ఎం.ఏ.రఫీక్,ఆకునూరి సత్యనారాయణ (టి.డి.పి),డా.ఎస్.కె.ఆర్.అన్సారీ(ఆప్),పి.నర్సి రెడ్డి(సి.పి.ఐ(ఎం),కోడి రాం ప్రసాద్( బి.ఎస్.పి), తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking