విద్యతో… జీవితానికి వెలుగు

విద్య జీవితానికి వెలుగునిస్తుంది – బిక్షపతి యాదవ్.

విద్యను మన నుంచి ఎవరు దూరం చేయలేరు రవి కుమార్ యాదవ్.

శంషిగూడా, ఎల్లమ్మ బండ ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
సoదయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బిక్షపతి యాదవ్ మరియు రవికుమార్ యాదవ్ చేతుల మీదుగా నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థి దశ మళ్లీ తిరిగి రానిదిదని కనుక అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని సూచించారు. ప్రపంచంలో అన్ని వస్తువులు కొనవచ్చు గాని విద్యను మాత్రం కొనలేమని తెలియజేశారు. చదువుతో పాటు సమయం కూడా చాలా విలువైనది, సమయం పోతే తిరిగిరాదు. కావున అందరూ బాగా చదువుకోవాలి చదువుకుంటేనే ఈ పోటీ ప్రపంచంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించ వచ్చని రవికుమార్ తెలియజేశారు.
ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో ప్రాంగణం లోకి నీరు వచ్చి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఉపాధ్యాయులు తెలియజేయగా దానికి సానుకూలంగా స్పందించి మా యొక్క ట్రస్టు తరఫున చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రవీందర్ రావు, నర్సింగ్ యాదవ్, వెంకట స్వామి రెడ్డి, వేణు యాదవ్, రామ్ మోహన్, మహిళ నాయకులు పద్మ, సందీప్ గౌడ్, వినోద్ యాదవ్ ,విష్ణు, శేఖర్, రఘు, కృష్ణ, రామకృష్ణ , ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking