విఆర్ ఓ లకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టులు
కలెక్టర్ రాహుల్ శర్మ
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
జిల్లాలో గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న 294 మంది విఆర్ ఓ లకు జి. ఓ. నెంబర్ 121 ప్రకారము 50 వివిధ శాఖలకు లాటరీ పద్దతిన జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో కేటాయింపుల ప్రక్రియ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. జిల్లా అధికారులు, రెవిన్యూ సిబ్బంది సమక్షంలో నిర్వహించిన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా వీడియో రికార్డింగ్ తో సహా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు కేటాయింపుల అనంతరం వి ఆర్ ఓ లకు పోస్టింగ్ ఆర్డర్ కాపీలు వెంటనే ఇవ్వడం జరుగుతుందని, ఆర్డర్ పొందిన వెంటనే కేటాయించిన శాఖలకు ఎట్టి పరిస్థితిలోనైనా ఈరోజు సంబంధిత శాఖకు రిపోర్ట్ చేయాలని వి ఆర్ ఓ లకు కలెక్టర్ సూచించారు. జిల్లా అధికారులు అందరు ఎంతసేపైనా కార్యాలయాలలోనే ఉండి వి ఆర్ ఓ లను జాయింట్ చేసుకున్న తరువాత అట్టి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,డి.అర్. ఓ.జగదీశ్వర్ రెడ్డి,మిర్యాలగూడ అర్ డి. ఓ.రోహిత్ సింగ్,కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతీ లాల్,కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.