జీఓ 121ను వెంటనే రద్దు చేయాలి !!
వీఆర్ ఓలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలి !!
వీఆర్ ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి !!
టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి డిమాండ్ !!
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రెవెన్యూ వ్యవస్థ తెలంగాణకు ఆయువు పట్టు.. ఇలాంటి కీలకమైన, ప్రధానమైన రెవెన్యూ విభాగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు
వి.లచ్చిరెడ్డి ఆరోపించారు. రెవెన్యూ శాఖపై ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. వీఆర్ ఓలను రెవెన్యూ విభాగం నుంచి తొలగిస్తూ జారీ చేసిన జీఓ నం.121ను వెంటనే రద్దు చేయాలని.. నిండు అసెంబ్లీలో వీఆర్ ఏలకు పే స్కేల్ ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో జీఓను రద్దు . సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వీఆర్ ఓల వ్యవస్థ రద్దు, వీఆర్ ఏల సమస్యల మీద పలు రెవెన్యూ సంఘాలతో కలిసి వి.లచ్చిరెడ్డి, వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్, అడిషనల్ సెక్రెటరీ జనరల్ పల్లెపాటి నరేష్, వైస్ చైర్మన్లు వెంకన్న, వినయ్ కుమార్, శ్రావణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి, శ్రీమతి ప్రతిభ, జేఏసీ నాయకులు వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
*రెవెన్యూ శాఖను అనాథను చేశారు..*
రెవెన్యూ వ్యవస్థకు క్షేత్రస్థాయిలో వీఆర్ ఓలు, వీఆర్ ఏలు చాలా కీలకమన్నారు. కానీ వీఆర్ ఓలను తొలగించి 22 నెలలు అయినప్పటికీ తొలగించారో ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పలేదన్నారు. ఎంతో కీలకమైన రెవెన్యూ శాఖకు సీసీఎల్ ఏ కమిషనర్ , రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, చివరకు రెవెన్యూ మంత్రి లేకుండా శాఖను మొత్తం నిర్వీర్యం చేసి అనాథగా మార్చారన్నారు. రాష్ట్రంలో కొత్త మండలాలు,కొత్త జిల్లాలు పెంచారు కానీ ఒక్క కొత్త పోస్టు కూడా పెంచలేదన్నారు. రెవెన్యూ శాఖలో ఒక్క పోస్టును క్రియేట్ చేయక పోగా 7000 వీఆర్ ఓ పోస్టులను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను తెచ్చిన తరువాత తహశీల్దార్, ఆర్‌డీఓ, కలెక్టర్ ఇలా ఎవరికీ అధికారాలు లేవన్నారు. దీంతో ప్రజలకు, రైతులకు ఎలాంటి సేవలు అందడం లేదన్నారు. ధరణి విషయంలో ఐఏఎస్ కూడా కంప్యూటర్ ఆపరేటర్ మీద ఆధార పడుతున్నారు. అందర్ని వేలిముద్ర వాళ్ళను చేశారన్నారు. ధరణి లో వచ్చిన సమస్యల పై ప్రభుత్వం నేటికి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ లో స్టేషన్ లో ఉండేది తామేనన్నారు. మాకు ఏమి చేయాలో తెలుసన్నారు. మాకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లో ప్రతి ఓటర్ కు చెపుతామన్నారు.
*15 రోజుల్లో రద్దు చేయకపోతే నిరవధిక సమ్మే..*
జీఓ నం.121ను వెంటనే రద్దు చేయకపోతే ఇదే విషయంపై రాష్ట్రంలోని 35వేల పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రజల సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతి, గవర్నరుకు ఫిర్యాదు చేస్తామన్నారు. 121 జీఓ ను వెనక్కి తీసుకోవాలి.. వీఆర్ ఏలకు పే స్కేల్ అమలు చేయాలి.. ఈ రెండింటిని 15 రోజుల్లో అమలు చేయకపోతే నిరవధిక సమ్మె చేస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థను స్తంభింప చేస్తామన్నారు. రెవెన్యూ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే నింపాలన్నారు. వీఆర్ ఓలను దొంగలుగా చిత్రీకరించి వేరే శాఖ లోకి పంపి ఏమి చేస్తారని ప్రశ్నినించారు. మమ్ములను దొంగలుగా చిత్రీకరించడం వలన మీకు వచ్చిన లాభం ఏంటన్నారు. మహా అంటే మా మీద ఏసీబీ దాడులు, సస్పెండ్ లు చేస్తారు కావచ్చు.. కానీ మా ఉద్యోగాలను తీయలేరన్నారు. వీఆర్ ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
డిపార్ట్మెంట్ పోయిన తరువాత సంఘాలు ఉండి ఏమి చేస్తాయని ప్రశ్నించారు. అందరూ అన్ని సంఘాలు కలిసి వీఆర్ ఓల, వీఆర్ ఏల హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసి,ఫీల్డ్ అసిస్టెంట్ లను ఇప్పుడు రెవెన్యు ఉద్యోగులు ఇలా ప్రభుత్వం అందరూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతుందని గుర్తు చేశారు.