మానవీయ సమాజాన్ని నిర్మించుకుందాం !

మానవీయ సమాజాన్ని నిర్మించుకుందాం !

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
అలజడులు ఆందోళనలులేని మానవీయ సమాజాన్ని నిర్మించుకోవడానికి మనమంతా కంకణదారులం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రగతిభవన్‌లో మంగళవారం నాడు జూలూరు గౌరీశంకర్‌ వెలువరించిన ‘‘ఒక సాహసి ఆలోచన’’ అన్న పుస్తకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు. దేశంలో మతసామరస్యం వెల్లివిరిసినప్పుడే అభివృద్ధి పథంలో దూసుకుపోతామని అన్నారు. 75 ఏళ్ల గాంధీ అనంతర భారతదేశాన్ని చూశాక మన మానవసంపదను శక్తివంతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు రూపకల్పనగా జరగబోయే దేశ పునర్నిర్మాణంలో యువ,నవశక్తులు కీలకపాత్ర పోషించాలని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking