ఉద్యమ స్పూర్తికై… గాంధీ చిత్ర ప్రదర్శన

ఉద్యమ స్పూర్తికై… గాంధీ చిత్ర ప్రదర్శన

22 లక్షలకు మంది విద్యార్థులకు గాంధీ చిత్ర ప్రదర్శన

*అత్తాపూర్ లో గాంధీ సినిమా ప్రదర్శనను ఆకస్మికంగా తనికీ చేసిన సి.ఎస్*

సిఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రంలో దాదాపు 22 లక్షలకు పైగా విద్యార్థినీ, విద్యార్థులకు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కలిగించే గాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం అత్తాపూర్ లోని మంత్ర సినిమా హాల్ లో విద్యార్థులకు ప్రదర్శిస్తున్న గాంధీ సినిమా ను మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తోకలసి ఆకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్బంగా విధ్యార్దులతోకలసి సినిమా ను కొద్దీ సేపు వీక్షించారు. అనంతరం సి.ఎస్ మాట్లాడుతూ, ప్రస్తుత యువ తరానికి గాంధీ సినిమాను ఇంత పెద్ద సంఖ్యలో ప్రదర్శించడం దేశంలోనే అతి పెద్ద కార్యక్రమమని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 552 సినీ స్క్రీన్ లలో రోజుకు రెడున్నర లక్షల మంది పిల్లలకు ఈ సినిమా ప్రదర్శిస్తున్నామని అన్నారు. ప్రస్తుత తరం పిల్లల్లో కనీసం ఒక శాతంకూడా గాంధీ సినిమా ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు.

స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్రం లోని ప్రతి ఇంటికీ ఒక జాతీయ పతాకాన్ని అందచేస్తున్నామని, ఇందుకు గాను కోటి 20 లక్షల జండాలను మన రాష్ట్రంలోని చేనేత కళాకారులే తయారు చేస్తున్నారని వెల్లడించారు. దేశంలోని మరే రాష్ట్రంలో ఇంతపెద్ద సంఖ్యలో జాతీయ పతాకాలు పంపిణి జరగడం లేదని తెలిపారు. అనంతరం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన జాతీయ జండాల పంపిణి కార్యక్రమంలో స్వతంత్ర వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ డా. కేశవరావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డిలతో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలంలోని సర్పంచులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు జెండాల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking