అట్టహాసంగా… ఇస్మాయిల్ జన్మదిన వేడుకలు

అట్టహాసంగా…
ఇస్మాయిల్ జన్మదిన వేడుకలు
అంబరాన్నంటిన సంబరాలు
జర్నలిస్టులకు మెడికల్ క్యాంప్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెంజు రాష్ట్ర అధ్యక్షులు, టి లైన్ 24 అధినేత సయ్యద్ ఇస్మాయిల్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇస్మాయిల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇస్మాయిల్ అభిమానులు, యునియన్ నేతల ఆధ్వర్యంలో కేక్ లు కట్ చేసి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, మహబూబ్ నగర్,వనపర్తి, హుజూర్ నగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ఇస్మాయిల్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మీడియా అకాడమీ, టియూడబ్ల్యుజేల అధ్వర్యంలో ఇస్మాయిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టియూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ ల సమక్షంలో జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్ ను కట్ చేసి ఆలింగనం చేసుకునిశుభాకాంక్షలు తెలుపుకుండ్రు. మేడ్చల్ జిల్లాలోని ఫిర్జాదిగూడలో రాఫా డయాగ్నస్టిక్ అధ్వర్యంలో జర్నలిస్టుల మెడికల్ క్యాంప్ 2. జర్నలిస్టులకు ఆరోగ్య పరీక్షలు జరిపి అవసరమైన మందులను పంపిణి చేశారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో దళిత ముస్లిం మైనార్టీ యూనియన్ నేతృత్వంలో మక్సూద్ అహ్మద్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మాడుగులపల్లి మండలంలోని కుక్కడంలో అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో మిర్యాలగూడ స్టాఫ్ రిపోర్టర్ మౌలాలి అధ్వర్యంలో మొక్కలను నాటారు. నాగోల్ లోని అక్షిత కార్యాలయంలోనూ ఇస్మాయిల్ జన్మదిన వేడుకల్లో భాగంగా అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి కేక్ కట్ చేశారు. ఎన్ ఎన్ ఆర్ ఇన్ ఫ్రా, ఫ్యూజన్ హాలిడేస్, అక్షిత తెలుగు జాతీయ దినపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సయ్యద్ ఇస్మాయిల్ కేక్ కట్ చేశారు. ఆయా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఇస్మాయిల్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రధాన, ప్రాథమిక కేంద్రాల్లోనూ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ లు పంపిణి చేయడంతో పాటు అన్నదానం చేపట్టారు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కలిగి ఉండి జర్నలిస్టులకు మరిన్ని సేవలందించాలని పలువురు నేతలు ఆకాoక్షించారు. ఆయా కార్యక్రమాల్లో టి లైన్ 24 చైర్మన్ యస్ కృష్ణవేణి, హెళ్తాద్రి డైరెక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ వీరయ్య, కార్పొరేటర్ స్రవంతి దేవేందర్ గౌడ్, కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి వహీద్, టి యూ డబ్ల్యు జే మేడ్చల్ జిల్లా అధ్యక్షులు అమర్,చారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking