రాం నాయక్ బర్త్ డే వేడుకలు

వృద్ధాశ్రమంలో ఘనంగా సినీ నటుడు రాం నాయక్ పుట్టినరోజు వేడుకలు

* దుప్పట్లు, పండ్లు పంపిణీ
చేసిన బంజారా హీరో

* రాం నాయక్ తో కేక్ కట్ చేయించిన ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలుగు చలనచిత్ర సినీ నటుడు రాం నాయక్ తన పుట్టినరోజు సందర్భంగా బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించుకొని యువతకు ఆదర్శంగా నిలిచారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కొత్త గూడెం గ్రామంలోని మహర్షి దయానంద సేవాశ్రమ ట్రస్టులో తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులందరికీ దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వృద్ధాశ్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. వయోధికుల నడుమ తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతేడాది విడుదలైన తన సినిమా రాం నాయక్ బంజారాల మనస్సును హత్తుకుందన్నారు. తన నటనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. త్వరలో మరో సినిమా నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలిపారు. తన చిత్రాలన్నీ గ్రామీణ జీవనాన్ని కండ్లకు కట్టినట్టు చూపించే విధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల మదిని మెప్పించే విధంగా ఉంటాయని అన్నారు. త్వరలో మరొక తెలుగు బంజారా భాషలో సినిమా తీయనున్నట్లు రాం నాయక్ చెప్పారు. ఇకపై సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని తెలిపారు. అంతకుముందు, రాం నాయక్ తో మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబు కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన శక్తి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు నాయక్, పుష్ప, ఆర్య నాయక్, వెంకట్, లాలు నాయక్, క్రాంతి నాయక్, రమేష్ నాయక్, ఆశ్రమ నిర్వాహకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking