10న జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం
ఇస్మాయిల్ జన్మదినోత్సవ వేడుకలు
మంత్రి మల్లారెడ్డి, అల్లం రాక
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఈ నెల10 న జర్నలిస్టుల ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు రాఫా డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులు పి. వీరయ్య , హెల్తాద్రి డైరెక్టర్ సాయికృష్ణలు తెలిపారు.తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జర్నలిస్టుల హెల్త్ క్యాంప్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టియుడబ్ల్యూజే కార్యదర్శి మారుతి సాగర్, పీర్జాదిగుడా మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, 19వార్డ కార్పోరేటర్ సరితా దేవేందర్ గౌడ్, టి లైన్24 చైర్మన్ ఎస్ కృష్ణవేణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని జర్నలిస్టులందరు హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Prev Post
Next Post