టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభ కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే భాస్కరరావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర రెండో మహాసభలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈనెల 27న హైదరాబాదులోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో సంఘం రాష్ట్ర రెండవ మహాసభ జరుగుతుందని టిడబ్లుజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆయూబ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫెడరేషన్ అంగరంగ వైభవంగా మహాసభ నిర్వహిస్తుందన్నారు. మహాసభలకు రాష్ట్ర మంత్రులు, అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, అన్ని పత్రికల ఎడిటర్లు, పలువురు ప్రముఖులు హాజరవుతున్నారన్నారు. జిల్లా నుండి వందలాదిమంది జర్నలిస్టులు మహసభకు తరలి వెళ్తున్నారని, మిర్యాలగూడ నియోజకవర్గంలో నుండి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఖాజా హమీదుద్దీన్, ఫెడరేషన్ నియోజవర్గ అధ్యక్ష కార్యదర్శులు మంద సైదులు, గద్దల జయరాజు, సీనియర్ జర్నలిస్టులు ఖాజానాజిముద్దీన్, నామిరెడ్డి నరేందర్రెడ్డి, కాతోజు నాగచారి, రాచకొండ రమేష్, రామకృష్హ, సైదులు, మహేష్ పాల్గొన్నారు.