అన్న ప్రసాద వితరణ

26వ రోజుకు చేరిన
అన్న ప్రసాద వితరణ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

నల్లమోతు భాస్కర్ రావు (ఎన్బీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఆ సంస్థ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం శుక్రవారం 26వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోగవెల్లి వెంకట రమణ చౌదరి(బాబ్జి), మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు బాసాని గిరి, ఆయిల్ శ్రీను, సర్పంచ్ బారెడ్డి అశోక్ రెడ్డి, సాధినేని శ్రీనివాస్ రావు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఏలుగుబెల్లి నాగరాజు, నల్లగంతుల నాగభూషణం, కడియం సైదులు, సచిన్, నల్ల శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking