దామ‌ర‌చ‌ర్ల‌లో ముగిసిన సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

దామ‌ర‌చ‌ర్ల‌లో ముగిసిన సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

దామరచర్ల, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజక వర్గంలోని దామ‌ర‌చ‌ర్ల‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న ముగిసింది. యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన అనంత‌రం సీఎం కేసీఆర్ హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం అయ్యారు. ఈ ప‌వ‌ర్ ప్లాంట్ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏరియ‌ల్ వ్యూ ద్వారా ప‌రిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ప‌నుల పురోగ‌తిని ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రికి అధికారులు వివ‌రించారు.

ఫ‌స్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయిల‌ర్ నిర్మాణంలో 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను సీఎం నిశితంగా ప‌రిశీలించారు. ఉన్న‌తాధికారుల‌తో కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. 2023, డిసెంబ‌ర్ చివ‌రి నాటికి యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి, విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించాల‌ని అధికారుల‌కు సూచించారు. రాష్ట్రానికి వెలుగులు పంచాల‌ని జెన్‌కోకు సూచించారు. ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు. 2015లో ఈ ప‌వ‌ర్ ప్లాంట్ ప‌నులు ప్రారంభం కాగా, ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. 5 వేల ఎక‌రాల్లో రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామ‌ర్థ్యంతో 5 ప‌వ‌ర్ ప్లాంట్ల‌ను నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానం పూడి సైదిరెడ్డి, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నల్ల‌గొండ జ‌డ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జ‌డ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking