అవధులు లేని” ఆనందా”లకు చోటు
ఆనంద లహరి…ఆనందాల హరివిల్లు
ఆర్ జే గ్రూప్ అధినేత భాస్కర్ రామ్ గుప్త
తార్నాక, అక్షిత ప్రతినిధి :
అవధులు లేని ఆనందం… ఆనంద లహరికి సొంతమని జనతా ఎస్టేట్స్, ఆర్ జే గ్రూప్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి హెచ్ భాస్కర్ రామ్ గుప్త, రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజులు అన్నారు. బుధవారం హైదరాబాద్ నగరం తార్నాకలో గల రాజా ఇన్ ఫ్రా ప్రధాన కార్యాలయంలో శంకర్ పల్లికి కూత వేటు దూరంలో మర్ పల్లిలో రూపుదిద్దుకున్న ఆనంద లహరి వెంచర్ బ్రోచర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కస్టమర్లకు అత్యంత తక్కువ ధరకు అత్యంత విలాసవంతమైన సదుపాయాలతో కూడిన ప్లాట్లు, ఫార్మ్ లాండ్స్ ను విక్రయిస్తున్నట్లు చెప్పారు. కస్టమర్ ల ఆనందాలకు ఇదే సరైన చోటు అన్నారు. వరల్డ్ క్లాస్ ఏమినిటీస్ తో కస్టమర్లకు విశిష్ఠ సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇన్వెస్టర్స్ కు మంచి లాభాలు అందించే లక్ష్యంతో లాంచింగ్ ఆపర్ ను ప్రకటించారు. రియల్ రంగంలో ఇప్పటికే హైదరాబాద్ నలుమూలల వెంచర్లు కల్గి ఉండి విశిష్ఠ సేవలందిస్తున్న ఆర్ జే గ్రూప్ మరిన్ని వెంచర్లతో ముందుకు వెళ్తుందని చెప్పారు. రియల్ రంగంలో క్రియాశీలక భూమిక పోషిస్తున్న మార్కెటింగ్ సిబ్బందికి భాస్కర్ రామ్ గుప్త వరాల జల్లు కురిపించారు.

లాంచింగ్ ఆఫర్ కస్టమర్స్ తో పాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ఆకర్షణీయమైన వరాల జల్లు కురిపించారు. డిసెంబర్ 15 వరకు బుకింగ్ ను లక్ష్యంగా చేసుకుని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మరింత ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక బహుమతులను ప్రకటించారు. రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు మాట్లాడుతూ
రియల్ రంగంలో విశిష్ఠ అనుభవం గడించిన రాజా ఇన్ ఫ్రా “ఆనంద లహరి “తో మరో అడుగు ముందుకేస్తుందన్నారు తక్కువ ధరకు సకల సదుపాయాలతో కూడిన ఆనంద లహరి అనే మెగా వెంచర్ ను ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నలువైపులా రియల్ రంగంలో ఎంతోమంది కస్టమర్లకు సేవలందించిన రాజా ఇన్ ఫ్రా వెస్ట్ హైదరాబాద్ లోనూ పాగా వేసిందన్నారు. వెస్ట్ హైదరాబాద్ శంకర్ పల్లికి సమీపంలో వరల్డ్ క్లాస్ ఏమినిటిస్ తో మెగా వెంచర్ రూపుదిద్దుకుoదన్నారు. వెంచర్ కు నలువైపులా చక్కటి రహదారులు కల్గి ఉండి హైదరాబాద్ కు కూత వేటు దూరంలోనే కస్టమర్స్ కు అందుబాటులో ఉంచామన్నారు. ఇన్వెస్టర్స్ కు మంచి లాభాలు అందివ్వడమే లక్ష్యంగా లాంచింగ్ ఆఫర్స్ ను అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ముంబై హైవే లో వెస్ట్ వెంచర్ గా రూపుదిద్దుకున్న ఆనంద లహరి విజయ తీరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.