నేడు తిప్పన ప్రమాణ స్వీకారం

నేడు తిప్పన ప్రమాణ స్వీకారం

ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా బాధ్యతలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయ సింహరెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈనెల 11న ఉదయం 9 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ నగరంలోని హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ ఎదురుగా గల రెడ్ హిల్స్, నాంపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టిఆర్ఎస్ వ్యవస్థాపక నుండి టిఆర్ఎస్ లో ఉంటూ 2009 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తిప్పన విజయసింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సీఎం కేసిఆర్ కట్టబెట్టారు. 20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి ఆయనను నియమించారు. గతంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలోనే విజయసింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజినల్ చైర్మన్ గా కూడా పనిచేశారు.

సీనియర్ నాయకుడు, స్థితప్రజ్ఞుడు, ప్రజల్ని కలుపుకుపోయే గుణం ఉన్న మహానేత ఎన్నిక కావడం మంచి పరిణామం. రైతు కుటుంబానికి చెందిన విజయసింహారెడ్డికి ఈ పదవి లభించడం రైతు సేవకు చేసుకొనే అవకాశం దొరికినట్లయిoది. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుంచి ప్రజా ప్రతినిధులు, గులాబీ శ్రేణులు, అభిమానులు అత్యధిక సంఖ్యలో హాజరు కానున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking