ఆధిపత్య కుల సర్పంచ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి

ఆధిపత్య కుల సర్పంచ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి

త్వరితగతిన విచారణ
చేపట్టి శిక్షించాలి

గ్రామ దళితులకు
రక్షణ కల్పించాలి

దళిత బహుజన ప్రజా సంఘాల నేతలు

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం బాజకుంట గ్రామానికి చెందిన అధికార పార్టీ అగ్రకుల సర్పంచ్ ఈదునూరి సరిత వికలాంగుడైన, దళితుడిపైన చెప్పు తీసుకొని విచక్షణారహితంగా దాడి చేసిన విషయం పై శనివారం దళిత బహుజన ప్రజా సంఘాల ఎం.ఆర్.పి.ఎస్,కెవిపిఎస్, పిఆర్.పి.ఎస్, ఎం.ఎస్పి,తెలంగాణ విద్యావంతుల వేదిక,మాల మహానాడు అధ్వర్యంలో బాజకుంటకు వెళ్లి బాధిత కుటుంబాలను, ఊరి పెద్దలను,కలిసి ఆ గ్రామంలో అందుబాటులో ఉన్న 22 కుటుంభాలకు సంబంధించిన దళితులతో మూకుమ్మడిగా మాట్లాడి నిజ నిర్థారణ చేయడం జరిగింది.అదే సమయంలో ఆ గ్రామానికి వచ్చిన పోలీసు అధికారులతో కూడా మాట్లాడం జరిగింది.

వివరాలోకి వెళితే నార్కెట్‌పల్లి మండలంలోని బాజకుంట గ్రామంలో 22 దళిత కుటుంబాలకు దళిత బంధు కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్టి డబ్బులలో సర్పంచ్ తనకి ఒక్కొక్క రు ఐదు వేయిల రూపాయలు ఇవ్వాలని కోరింధనేది దళిత కుటుంభాల ఆరోపిస్తున్నాయి. డిసెంబర్ 4 న దళిత బంధు డబ్బుల విషయంలో ఒక పంక్షన్ లో దళితుడైన వర్కాల సైదులు పైన వెల్మరెడ్డి ఇంద్రారెడ్డి దాడి చేయడం జరిగింది.ఇదే విషయం లో బాధితుడైన పరుశరాములు ఐదు వేయిల రూపాయలు సర్పంచ్ కి ఇచ్చారని మిగతా వారు ఎవరు కూడా ఇయ్యకపోవడంతో నా డబ్బులు నాకివ్వాలని అనడం తో..పరుశరాములు సర్పంచ్ ని బూతులు తిట్టాడని ఊర్లో డప్పు కొట్టించి డిసెంబర్ 9 న శుక్రవారం రోజు న గ్రామ పెద్ద మనుషుల సమక్షంలోకి పిలిపించడం జరిగింది. ఇట్టి విషయంపై పెద్ద మనుషులు అతని వివరణ కోరుతున్న సమయంలో దళిత వికలాంగుడైన వర్కాల పరశురాములు పైన అధికార పార్టీకి చెందిన ఈదునూరి సరితా రవీందర్ రెడ్డి విచక్షణ కొల్పోయి అతని కులం పేరుతో దూషించి చెప్పులతో బహిరంగంగా కొట్టడం జరిగింది.ఇది మొత్తం వీడియో లో బంధించడం జరిగింది. ఈ సందర్భంగా కంధుకూరి సోమయ్య(ఎం.ఆర్.పి.ఎస్)నూనె వెంకట స్వామి(పి.ఆర్.పి.ఎస్) పాలడుగు నాగార్జున(కెవిపిఎస్) పందుల సైదులు( తెలంగాణ విద్యావంతుల వేదిక) మాట్లాడుతూ తక్షణమే ఈదునూరి సరిత రవీందర్ రెడ్డి ని అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు.త్వరితగతిన విచారణ జరిపి, ఎస్.సి,ఎస్.టి అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేసారు.గ్రామంలో పోలీస్ పికెటింగ్ ను ఏర్పాటు చేసి, దళిత కుటుంబాలకు రక్షణ కల్పించాలన్నారు.దాడి చేస్తున్నప్పుడు వీడియో తీసిన వ్యక్తి కి సర్పంచ్ నుంచి ప్రాణ హని ఉన్నందున అతని కి ప్రత్యేక రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు.,పోలీస్ అధికారులను అప్రమత్తమై బాధిత దళితుల వైపు న్యాయం జరిగే విధంగా చూడాలని లేనిచో సర్పంచ్ మరియు వారి బంధువులు మరింత రెచ్చిపోయి దళితులను గ్రామం నుండి సాగనంపే ప్రమాదముందన్నారు.వెల్మరెడ్డి ఇంద్రారెడ్డి పై,సరితా రవీందర్ రెడ్డి పై వేరు వేరుగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మేడి నరసింహ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లే పరమేష్, బక్రం శ్రీనివాస్ మహజన సోషలిస్ట్ పార్టీ,చింత సైదులు ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, గోలి ఏడుకొండలు జర్నలిస్ట్ ,బందెల బిక్షం, బోడే ఎల్లయ్య, చింత శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking