పల్లెలకు మహర్దశ

మారుమూల గ్రామాలకు సైతం మహర్దశ
-ఎంపీపీ గుమ్మడి గాంధీ

పినపాక, అక్షిత ప్రతినిధి : పల్లెలకు మహర్దశ కల్గింది. పట్టణాలతో సమంగా పల్లెలను సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతిని చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మారుమూల గ్రామాలకు సైతం రహదారులు ఏర్పడుతున్నాయని పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు.శనివారం పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతిలోని దుబ్బగుంపు గ్రామం నుండి అమరవరం గ్రామం వరకు ఎంఆర్ఆర్ నిదులనుండి మంజురైన రహదారి పనులను పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 1కోటి 18 లక్షల రూపాయలతో రహదారి మంజూరు అయిందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అద్యక్షులు అదేశాల మేరకు పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కాయం శేఖర్, పోలిశెట్టి హరీష్, ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, సహకార సంఘం ఛైర్మన్ రవి వర్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి వాసు బాబు, స్థానిక సర్పంచులు, జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ అమరారం సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking