అవినీతి అంతానికి… కదిలిరండి

అవినీతి అంతం చేద్దాం.. కదిలిరండి

అవినీతి వ్యతిరేక దినోత్సవం సంధర్బంగా వాక్..

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో నిర్వహణ

వాక్ ప్రారంభించిన మాజీ చీఫ్ స్పెషల్ సెక్రటరీ అజయ్ మిశ్రా

ప్రతిజ్ఞ చేపించిన ఆర్టీఐ మాజీ కమిషనర్ డా. వర్రె వెంకటేశ్వర్లు

 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

 

సమాజంలో అవినీతి నిర్మూలన కోసం పనిచేస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సంధర్బంగా నెక్లెస్ రోడ్ లో అవినీతి నిర్మూలనకు వ్యతిరేకంగా వాక్ నిర్వహించారు. అవినీతి నిర్మూలిద్దాం, సమాజాన్ని మారుద్దాం అని వందలాది మంది విద్యార్థులు, యువత నినాదాలు ఇస్తూ వాక్ కొనసాగించారు..

ఈ అవినీతి వ్యతిరేక వాక్ ను తెలంగాణ మాజీ చీఫ్ అడిషనల్ సెక్రటరీ, రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అవినీతి క్యాన్సర్ లా పెరిగిపోతుందని, దానిని నిర్మూలించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. అవినీతి పెరగడం వల్ల విలువలు తగ్గిపోయి, చెడు రాజ్యమేలుతుందన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ గత పది సంవత్సరాలుగా అవినీతి రహిత సమాజం కోసం వినూత్న కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.

మాజీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ డా. వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారుల్లో జవాబుదారీతనం, పాలకుల్లో పారదర్శకత లేకపోవడం వల్లనే అవినీతి పెరిగిపోతుందన్నారు. అవినీతి పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజలు, పౌరులు చట్టాలను ఉపయోగించుకొవాలన్నారు. సమాజంలో అవినీతి పెరిగిపోతుందని అందరూ చెపుతున్నారు కాని అవినీతి నిర్మూలనపై పనిచేసే వారు, ప్రశ్నించే వారి సంఖ్య తగ్గిపోతుందన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ అవినీతిని ప్రశ్నించడమే కాకుండా, నిజాయితీపరులను గుర్తించడం మంచి పరిణామమన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ మంచి సమాజం కోసం పోరాటం చేస్తుందన్నారు. అవినీతి నిర్మూలన కోసం తమ వంతు బాధ్యతగా ఉద్యమం చేస్తానని విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేపించారు.

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అవినీతి రహిత సమాజం కోసం వేలాది మందితో పనిచేస్తున్నామన్నారు. యువతలో ప్రశ్నించేతత్వాన్ని అలవర్చేందుకు అవినీతి నిర్మూలన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సమాచారహక్కు చట్టాన్ని ఆయుధంగా మార్చుకొని అవినీతి నిర్మూలన కోసం తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ఇంచార్జ్ జయరాం, యాక్ బృందం కానుగంటి రాజు, కొన్నె దేవేందర్, కొమటి రమేశ్ బాబు, వరికుప్పల గంగాధర్, జి. హరిప్రకాష్, రాజేశ్, అంజుకర్, మారియా అంతోని డా. ప్రతిభాలక్ష్మి, లక్ష్మికళ, శివనాగరాజు, కాకతీయ పాఠశాల ప్రిన్సిపాల్ హరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking