
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
సింగరేణి కాలరీస్ కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో అత్యంత ఘనంగా నిర్వహించే 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ పాల్గొననున్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించే సాంస్కృతిక ప్రదర్శనలు అలరించే విధంగా ఉండాలని ఉద్దేశంతో సోమవారం ఈ ఎంపికలను సిఈఆర్ క్లబ్ నందు నిర్వహించారు. ఈ ఎంపికలకు కొత్తగూడెం పట్టణంలోని వివిధ పాఠశాలల విధ్యార్ధిని విధ్యార్ధులు ఎంతో ఉత్సాహంగా సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ కె.శ్రీనివాసరావు, డివైపిఎం ముకుంద సత్యానారాయణ, సీనియర్ పిఓలు బేతి రాజు, గట్టు స్వామి, అసిస్టెంట్ స్పొర్ట్స్ సూపర్వైసర్ ఎంసి పాస్నెట్, సీనియర్ స్కౌట్ లీడర్లు, కొత్తగూడెం పట్టణంలోని వివిధ పాఠశాలల ఉపాద్యాని ఉపాద్యాయులు విధ్యార్ధిని విధ్యార్ధులు పాల్గొన్నారు.