కంటి వెలుగు క్యాంప్ ను ఆకస్మిక తనిఖీ,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

సోమవారం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తిప్పర్తి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంప్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాంపు కు కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రజలకు ఎంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు వివరాలు అడిగి తెలుసుకున్నారు.కంటి పరీక్షలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని పరీక్షలకు అవసరం మైన అన్ని సిద్దంగా ఉంచుకోవాలని మందులు, గ్లాస్ లు, వెంటనే అందించాలని క్యాంప్ లో ప్రజలకు ఇబ్బంది లేకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఈ తనిఖీలో కలెక్టర్ వెంట నల్గొండ అర్.డి. ఓ జయ చంద్ర రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking