పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు ఎంపీ రవిచంద్ర తన సహచర సభ్యులతో కలిసి గోవాలో పర్యటన

తిరుపతి, అక్షిత ప్రతినిధి :

శుక్రవారం కలియుగ ఇష్టదైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు, కమిటీ ఛైర్మన్ రమేష్ బిదూరియా, సభ్యులు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యుని హోదాలో కమిటీ ఛైర్మన్ రమేష్ బిదూరియా, సహచర సభ్యులతో కలిసి అధ్యయన యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా వారు ఆది, సోమవారాలు రెండు రోజులు గోవాలో పర్యటించారు. అంతకుముందు శుక్రవారం కమిటీ ఛైర్మన్, సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ఇష్ట దైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని,ఆ తర్వాత చెన్నై వెళ్లారు.ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి ఈ స్టడీ టూరుకు వెళ్లారు.కమిటీ ఆది,సోమవారాలు రెండు రోజులు గోవాలో పర్యటించి సంబంధిత అధికారులు,నిపుణులతో సమావేశమైంది. పెట్రోలియం,సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం
ఛైర్మన్ రమేష్ బిధూరియా నేతృత్వంలో ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు ఈ యాత్ర తిరుపతి,చెన్నై,గోవా తదితర చోట్ల కొనసాగింది.ఈ సందర్భంగా వారు
దక్షిణాది రాష్ట్రాలలో పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తుల ధరలు, మార్కెటింగ్, సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. మానవ వనరుల విధానం, వినియోగంపై జరిగే సమావేశంలో వారు పాల్గొన్నారు. గోవాలో నెలకొన్న ప్రఖ్యాత IPSHEM శిక్షణా కేంద్రాన్ని సందర్శించి,ఆయిల్ రిఫైనరీపై సమీక్ష జరిపారు, ప్రభుత్వ రంగ పరిశ్రమలలో చమురు సంస్థల స్థాపనకు తీసుకోవాల్సిన భద్రత, రక్షణ చర్యలపై సంబంధిత అధికారులు,నిపుణులతో చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking