చిట్యాల అక్షిత ప్రతినిధి:
“దళిత జిల్లా నాయకుడు పోకల దేవదాసును చిట్యాలలోని కంటివెలుగు కార్యక్రమం లో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ జడల ఆదిమల్లయ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని” PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి, CPM జిల్లా నాయకుడు జిట్ట నగేశ్, BJP జిల్లా నాయకుడు శేపూరి రవీందర్, MRPS ఇంఛార్జి మేడి శంకర్, YSRTP ఇంఛార్జి పోకల అశోక్, TDP శేపూరి సుదర్శన్ లు డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీ ఆఫీస్ ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ముట్టడి సందర్భంగా మట్లాడారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ ప్రదర్శన నిర్వహించి SI కి పిటిషన్ అందజేశారు.
ఇందులో సంతోష్, గోపాల్,పాల కృష్ణ, పాల భిక్షం,గ్యార శేఖర్,గంటెపాక స్వామి,జిట్ట భిక్షం,నూనె శ్రీకాంత్,దాసరి స్వామి, వల్లమళ్ళ యాదగిరి,పోకల ఏసురత్నం,చిన్నస్వామి,చిత్రగంటి నాగరాజు,జిట్ట చంద్రయ్య,జోగు చంద్రమౌళి పాల్గొన్నారు.