
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
నిధులు కేటాయించి పూర్తిచేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్
పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా ప్రజల బ్రతుకులు మారడం లేదని గత 15 ఏళ్లుగా ముషంపల్లి రోడ్డు అతుకుల గతుకులుగా మారిందని అత్యధిక నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముషంపల్లి నుండి వెలుగు పల్లి అన్నారం అన్నారేడు గూడెం రసూల్ పురం గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ముషంపల్లి రోడ్డు రద్దీగా మారిందని అనేకమంది యాక్సిడెంటులకు గురి అయ్యి మరణించారని అంగవైకల్యం చెందారని అయినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్ అండ్ బి శాఖ వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి డబల్ రోడ్డుగా మార్చాలని వెలుగు పల్లి నుండి రసులుపురం దుప్పలపల్లి రైల్వే ట్రాక్ వరకు డాంబర్ రోడ్డుగా మార్చటకు నిధులు కేటాయించాలని కోరారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రోడ్డు విషయంలో కనీసం పట్టించుకోవడం లేదని గుంటలు పడినప్పటికీ మట్టి పోయడానికి కూడా నిధులు లేవు అనడం ఏమిటని ప్రశ్నించారు నల్లగొండ మండలంలో వివిధ గ్రామాలలో పేరుకుపోయిన సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. అన్నారం నుండి అన్నారెడ్డి గూడెం తోరగలు వరకు రోడ్డు గుంతల మాయమైందని వెంటనే పూర్తి చేయాలన్నారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు ఇవ్వడం జరిగిందని జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గా సభ్యులు సయ్యద్ హాసన్ పాలడుగు ప్రభావతి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ మండల కార్యదర్శి నలపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు దొండా కృష్ణారెడ్డి జిల్లా అంజయ్య నలపరాజు సైదులు కొండా వెంకన్న పోలే సత్యనారాయణ బొల్లు రవీందర్ కొత్త అంజయ్య బత్తుల బక్కయ్య బత్తుల వెంకయ్య కండే యాదగిరి మల్లెబోయిన లింగస్వామి ముక్కామల యాదయ్య కోత్త అంజయ్య బొల్లోజు భారతమ్మ దండంపల్లి సరోజ భూతం అరుణకుమారి కనుకుంట్ల ఉమారాణి గోలి నరసింహ అంజిరెడ్డి పగిళ్ల సైదులు ఎరమాద బాబు రెడ్డి బక్కతట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.