మన ఊరి మెస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి:

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలో గల రాఘవేంద్ర కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన మా ఊరి మెస్ హోటల్ ను కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మేల్యే ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ సంధర్భంగా అయన మాట్లాడుతు నాణ్యమైన వంటకాలతో, రుచి శుచి పాటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుని అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగుల సంఘము వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రాజేష్, అశోక్ సాగర్, విష్ణు వర్ధన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గోపాల్ యాదవ్, మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking