ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బే షరతుగా క్షమాపణ చెప్పాలి -జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి

చేర్యాల,జనవరి 23 అక్షిత న్యూస్:

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కాంగ్రెస్ నాయకుల పట్ల చేసిన పదాజాలంను వెనక్కు తీసుకోని, కాంగ్రెస్ నాయకులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని సిద్దిపేట జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చేర్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేర్యాల,మద్దూరు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా,ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరికొండ రెడ్డి హాజరై మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల పట్ల జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన వాక్యలు తక్షణమే వెనక్కు తీసుకోని బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు.లేని యెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ నియోజకవర్గంలో మిమ్మల్ని తిరుగనివ్వకుండా అడ్డుకుంటారని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో చేర్యాల మద్దూర్ మండలాల అధ్యక్షులు ఆది శ్రీనివాస్, బండి శ్రీనివాస్, చేర్యాల పట్టణ అధ్యక్షులు మంచాల చిరంజీవిలు, చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్లు సందుల సురేష్, చెవిటి లింగం, ఆయా గ్రామాల పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు తుమ్మల పల్లి సంజీవులు, ముస్త్యాల యాదగిరి, అతర్ అహ్మద్, బాల స్వామి, మరియు తదితర గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking