రాజ్ కుమార్ మృతికి.. సింగరేణి జి‌ఎం ఆనందరావు సంతాపం

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

కొత్తగూడెం ఎబిఎన్ రిపోర్టర్ కల్లూరి యతి రాజ్ కుమార్ గుండె పోటుతో ఆకస్మిక మృతి చెందారు. విషయం తెలుసుకున్న సింగరేణి జి‌ఎం పర్సనల్ ఐ‌ఆర్‌పి‌ఎం అండ్ అధికార ప్రతినిధి ఏ.ఆనందరావు సోమవారం మృతుడు రాజ్ కుమార్ స్వగ్రామం జూలూరుపాడు గుండెపూడికి వెళ్ళి పార్ధీవ దేహానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జి‌ఎం మాట్లాడుతూ రాజు మృతి చెందాడనే వార్త విన్న తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. రాజు మరణం చాలా బాధాకరం ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే వ్యక్తి మన మధ్య లేడు అనే నిజాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాజు మృతితో విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking