
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
జనయేత్రి ఫౌండేషన్ విద్యా వైద్యం మరింత సేవలు అందించాలని గిన్నిస్ బుక్ రికార్డు
సాధించిన సంపత్ కుమార్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో జరిగిన జనయేత్రి ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఎంఈఓ బాలాజీ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగాలకు జనయేత్రీ ఫౌండేషన్ చేసిన సేవలు అభినందనీయమన్నారు. ముందు ముందు బడుగు బడిగిన వర్గాలవర్గాల పిల్లలు చదివే పాఠశాలలను స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలలను బలోపితం చేయాలని కోరారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ
కుల,మత, వర్గ,వైషమ్యాలకు తావు లేకుండా, సహృదయంతో సేవానిరతిని పాటిస్తూ నిస్వార్థంగా పేదలకు, నిరుపేద విద్యార్థులకు, రోగులకు,ఆర్తితో తల్లడిల్లే అభాగ్యులకు సహాయ సహకారాలు ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు ఉచిత విద్య,వైద్యం అందచేయాలనే సంకల్పంతో పాటు వివిధ రకాలుగా సేవలు చేస్తూ రక్త దాన శిబిరాలు, అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేస్తూ,చేపిస్తూ ప్రాణాపాయం నుండి కాపాడుతున్నామని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాలు ,అన్నదానం, దుప్పట్ల పంపిణీ, మజ్జిగ పంపిణీ, చలి వేంద్రాల ఏర్పాటు, అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో, నిరాశ్రయులకు పండ్లు మరియు భోజనం ఏర్పాట్లు, విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణీ, ఆపదలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు, నిస్సహాయులకు ఆర్ధికంగా,హార్ధికంగా సహాయ సహకారాలు, రక్త దానాలు, ఇంకా ఇలా ఎన్నో సేవలను అందించామని అన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ప్రముఖ ఇంటర్నేషనల్ తైక్వాండో ప్లేయర్ కుమారి సింధు తపస్విని, సినీ నటులు వన్స్ మోర్ వాసు,ప్రముఖ రక్త దాత మోహినుద్దీన్,హైకోర్టు న్యాయవాది హమీద్,ప్రముఖ వైద్యులు జాడి రాజు,బాలాజీ,తులసి రామ్,నాగుర్,అర్బాష్ ఖాన్,వికాష్,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వెంకట్రామ్ నాయక్, మధీహా, ఏయస్ ఐ లు కిషోర్, బిక్షం, సలహా దారులు సుదర్శన్ రెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ కంచర కుంట్ల దయాకర్ రెడ్డి ,అహ్మద్, జన యేత్రి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సింహ,సంజీవ రెడ్డి, శివ లీల,తాజ్ బాబా,అమీర్ అలీ,పోగుల సందీప్,కృష్ణ యాదగిరి,వరలక్ష్మి,శ్రీనివాస్ రెడ్డి,ఉమ,ఫహిం, ఏకాంబర్ చారి, సిరోజ్,సందీప్ , నౌసిన్, కావ్య,ఫిరోజా తదితరులు పాల్గొన్నారు