ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన నిందితుడిపై పీడీయాక్ట్

వరంగల్,అక్షిత బ్యూరో :

ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి రంగనాథ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేసినారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానని యువతి యువకులను మోసం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలేం చెందిన డాకురి భిక్షం పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గడ్డం సదన్ కుమార్ నిందితుడికి ఖమ్మం కారాగారం అందజేసారు. అనంతరం నిందితుడు చర్లపల్లి కారాగారానికి తరలించారు.
పీడీ యాక్ట్ అందుకున్న నిందితులు ఇద్దరు మరో ముగ్గురు నిందితులతో కల్ని ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానని చదువుకున్న యువతి యువకులను మోసం చేసి వారి నుండి లక్షల్లో డబ్బువసూళ్ళకు పాల్పడిన సంఘటనలో నిందితుడుని గతంలో వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేసారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ చట్టవ్యతిరేక కార్య కలపాలకు పాల్పడే వ్యకులపైచట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని వరంగల& పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking