వరంగల్,అక్షిత బ్యూరో :
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం మునుగులో దోపీడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు సోమవారం అరెస్టు చేయగా మరొ నిందితుడు పరారీలో వున్నాడు. వీరి వద్ద నుండి పోలీసులు 8వేల నాలుగు వందల రూపాయల నగదు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..ఈ అరెస్టుకు సంబంధించి ఈస్ట్రన్ డిసిపి వెంకటలక్ష్మీ వివరాలను వెల్లడిస్తూ ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడు వరంగల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన విజయకుమార్, పర్వతగిరి ప్రాంతానికి చెందిన రాయపురం సరిత, కేసముద్రం ప్రాంతానికి చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలతో కల్సి ఒక ముఠా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగంగా ఈ ముఠాలో ముగ్గురు కిలాడీ లేడీలు బస్టేషన్లలో బస్ స్టేషన్లో అమాయకులైన యువకులను తమ సైగలతో వారిని ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఒక వెహికల్ ని కిరాయికి తీసుకొని వారి తోపాటు సదరు విటుడుని కూడా ఎక్కించుకొని వరంగల్ నగర పరిసర గ్రామాలలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకు వెళ్తున్న సమయంలో ఆ ముఠా లోని మహిళలకు విజయ్ కుమార్ కు ఫోన్ ద్వారా రహస్యంగా సమాచారం చేరవేస్తారు. సమాచారం అందుకున్న నిందితుడు విజయ్ కిలాడీ లేడీలు వున్న ప్రాంతానికి చేరుకోని వారితో వున్న యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.
ఈ విధంగా ఈ ముఠా మామునూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు అయినవి ఈ రెండు కేసులలో 20 వేల రూపాయల నగదు ఒక సెల్ ఫోను దోపిడికి గురయినాయి మరియు గీసుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ధర్మారం గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర నుంచి 3000 నగదు మరియు 2000 రూపాయల విలువగా ఫోన్ లను బలవంతంగా దోపిడీ చేశారు కాగా నమ్మదగిన సమాచారంతో ఈరోజు మామునూరు సిఐ క్రాంతి కుమార్ గారు తన యొక్క సిబ్బందితో సదరు ముగ్గురు మహిళ నిందితురాళ్ళను రాంగోపాలపురం వద్ద అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసిపి నరేష్ కుమార్, ఇన్సెస్పెక్టర్ క్రాంతికుమార్, ఎస్.ఐ. రాజేష్ రెడ్డి, కానిస్టేబుల్లు సర్థార్పోషా, రోజులను ఈస్ట్ జోన్ డిసిపి అభినందించారు.