పలు అభివృద్ధి,శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల

ఆర్మూర్, అక్షిత ప్రతినిధి:

బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలో పలు అభివృద్ది పనులకు సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్ధాపన చేశారు.ఉదయం వేల్పూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం,అంక్సాపూర్ రోడ్ వద్ద 40 లక్షలతో స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులకు  శంకుస్థాపన, వేల్పూర్ లో ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం,అమీనాపూర్ X రోడ్ వద్ద వేల్పూర్ రోడ్ పై 20 లక్షలతో స్లాబ్ కల్వర్టు శంకుస్థాపన,వేల్పూర్ మార్కెట్ కమిటీ వద్ద 95 లక్షలతో నూతనంగా నిర్మించే సీడ్ సర్టిఫికేషన్ ఆఫీస్ బిల్డింగ్ భూమిపూజ,శంకుస్థాపన కార్యక్రపామాల్లో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్  ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు.గత నాలుగు నెలలుగా అభివృద్ది పనుల శంకుస్ధాపన,ప్రారంభోత్సవ పనుల పరంపర కొనసాగుతోందని తెలిపారు. వ్యవసాయానికి ప్రసిద్దిగాంచిన ఆర్మూర్ తాలూకా ప్రాంతంలోని వేల్పూర్ లో విత్తన అభివృద్ది సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ రైతాంగానికి ఎంతో ఉపయోగకరం అన్నారు. ఈ ప్రాంత రైతులు అనుభవజ్ఞులు అని ఇక్కడి విత్తనాల గురించి దేశ వ్యాప్తంగా మంచి ప్రచారం ఉందని విత్తన అభివృద్ది సంస్థ చైర్మన్ కోటేశ్వర రావు అన్నారు. సీడ్ యేజన్సి ఏర్పాటుకు ల్యాండ్ కావాలని మంత్రిని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. రైతు నాయకుడు తన తండ్రీ స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారికి కోటేశ్వర రావు ఆప్తులు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వారు ఈ ప్రాంత రైతాంగం కోసం ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking