ప్రశాంతంగా ముగిసిన కొమురవెల్లి చిన్నపట్నం,అగ్నిగుండాలు-పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు- పోలీస్ సిబ్బందికి అభినందనలు-అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్
చేర్యాల,జనవరి 23 అక్షిత న్యూస్:
కొమురవెల్లి మండలం లోని శ్రీ మల్లికార్జున స్వామి చిన్న పట్నం, అగ్ని గుండాలు ముగిసిన సందర్భంగా, అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్ మాట్లాడుతూ శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తోట బావి సమీపంలో చిన్నపట్నం, అగ్నిగుండాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్, కొమరవెల్లి టెంపుల్ ప్రెసిడెంట్, మరియు కార్యవర్గ సభ్యులు మరియు పట్నం భక్తులు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.మల్లన్న భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ప్రశాంత వాతావరణంలో ముగిసిన చిన్న పట్నం, అగ్నిగుండాల పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, మరియు సీసీ కెమెరాల ద్వారా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ లో నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. సహకరించిన మల్లన్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. బందోబస్తు నిర్వహించిన పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీబీ సతీష్, ట్రాఫిక్ ఏసిపి ఫణీందర్, ఎస్బి ఎసిపి రవీందర్ రాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, చేర్యాల సీఐ శ్రీనివాస్, హుస్నాబాద్ సీఐ కిరణ్, కొమరవెల్లి ఎస్ఐ చంద్రమోహన్, మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎన్సిసి క్యాండిడేట్స్, బందోబస్తు నిర్వహించడం జరిగింది.